Saturday, February 21, 2009

నిమ్మ కాయ ఉపయోగాలు

1.ఎండిపోయిన నిమ్మచెక్కలతో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు తోమితె తళ తళా మెరుస్తాయి.

2.కమల ,నిమ్మ తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా చెసి ఎండపెట్టి పొడి చెసి సర్ఫ్ లొ కాని, సున్ని పిండి లొ కాని వేస్తె చక్కటి సువాసన తొ పాటు మురికి కూడ వదులుతుంది.

3.గొరు వెచ్చనివేడి నీళ్ళ లొ తేనె నిమ్మరసం వేసుకుని పరకడుపున తాగితె బరువు తగ్గుతారు.

4.మోచేతులు ,పాదాలు నల్లగవుంటె వాడెసిన నిమ్మ తొక్కలు వేసి రుద్దితె తెల్లగ వస్తాయి.

5.వాడెసిన నిమ్మ తొక్కలని కుక్కర్ లొ వెసి వుడికించిన కుక్కర్ కింద నలుపు పోయి తెల్లగ అవుతుంది.

వంటింటి చిట్కాలు

1. డ్రై ఫౄట్స్ చెడిపొకుండా ఏక్కువ కాలం నిలవ వుండాలంటె ఆ డబ్బా లొ కాసిని లవంగాలు వేస్తె సరి.

2.ఎండిన నిమ్మచెక్కలతో రాగి పాత్రలు ఈత్తడి పాత్రలు తొమిన తల తల మెరుస్తాయి.

3. కమలా కాయ తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడి చెసి
సర్ఫ్ లొ కాని సున్నిపిండి లొ కాని కలపితే సువాసన తో పటు మురికి కూడ త్వరగ పొతుంది.

4. నిమ్మ కాయలు మరుగుతున్న నీటిలొ వేసి కొన్ని సెకనులు వుంచి తీసినట్లయితె రెట్టింపు రసం వస్తుంది.

5. గాజు గ్లాసులు ఒకదానిలొ ఒకటి పడి రాకపొతె పైన గ్లాసులొ చల్లని నీళ్ళు పోసి, లొపల గ్లాసును వెడి నీళ్ళు ముంచితె త్వరగ వచ్చేస్తుంది.

6. కొత్త బియ్యం వండేటపుడు కొన్ని చుక్కలు నూనె, కొంచెం పప్పు వెస్తె అన్నం ముద్దగా అవకుండ, ఆతుక్కోకుండ ఉంటుంది.

7. కర్వేపాకు ఎక్కువరొజులు నిల్వ వుండాలంటె, రెమ్మలు విరిసి ఒక సీసాలొ పెడితె సరి.

8. అట్లు రుచి గా వుండలంటె పిండి రుబ్బేపుడు బంగలదుంప ముక్కలు వేయాలి.

9. చపాతీలు మెత్తగా రావాలంటె పిండిలో కొంచెం పెరుగు వేసి కలిపి ఒక గంట నాననివ్వాలి.

10. ఫూరీలు కరకరగా రావాలంటె పిండిలో కొంచెం పాలు వేసి కలిపి ఒక గంట నాననివ్వాలి.